Afghanistan: ఆఫ్గాన్‌కు కొత్త చట్టాలేమి అవసరం లేదంటున్న తాలిబాన్ చీఫ్!
ఆఫ్గానిస్తాన్ కు పాశ్చాత్య చట్టాలు అవసరం లేదని తాలిబన్ చీఫ్ హిబాతుల్లా అఖున్ జాదా పేర్కొన్నారు.షరియా చట్టం అమలులో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం అవసరం లేదన్నారు.
ఆఫ్గానిస్తాన్ కు పాశ్చాత్య చట్టాలు అవసరం లేదని తాలిబన్ చీఫ్ హిబాతుల్లా అఖున్ జాదా పేర్కొన్నారు.షరియా చట్టం అమలులో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం అవసరం లేదన్నారు.
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భీకరమైన ఎండలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నేడు కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
మయన్మార్ తో పాటు థాయ్ లాండ్ లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యాసంవత్సరం నుంచి ఆరోతరగతి నుంచి బాలురకు ప్యాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది.ఆరోతరగతి నుంచి 12 వ తరగతి బాలురకు ప్యాంట్లు కుట్టి అందించాలని స్వయం సహాయక సంఘాలకు తెలియజేశారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజుతోపాటు 16 మంది పై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. గుంపుగా ఏర్పడి పోలీస్ ఠాణాకు వచ్చే ప్రజలకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే.. సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారు? అనే దాని మీద సీ ఓటర్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో డీఎంకే అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఎక్కువ మంది ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామన్నారు.
ఏపీలో 26 జిల్లాలకు గానూ శనివారం 22 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.విజయనగరం 23, శ్రీకాకుళం20, తూర్పుగోదావరి19, పార్వతీపురం మన్యం 13, అనకాపల్లి 11 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు.
స్టాండ్-అప్ కామెడియన్ స్వాతి సచదేవా ఓ ప్రదర్శనలో తన తల్లి మీద చెప్పిన జోక్ వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. కొందరు దీన్ని సరదాగా తీసుకోగా, మరికొందరు తల్లిదండ్రులను జోక్‌గా చూపించడం హద్దు దాటడం అని అభిప్రాయపడుతున్నారు..