7 కిలోమీటర్ల పాటు హింస.. నిర్భయ లాంటి ఘటన.. కదులుతున్న బస్సులోనే!
ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. బస్సులో అన్నం పడేశాడన్న కారణంతో 22 ఏళ్ల యువకుడిని డ్రైవర్, అతని స్నేహితులు చిత్రహింసలు పెట్టారు. రాడ్డుతో కొట్టి చంపేశారు. శవాన్ని బస్సులో నుంచి పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన దేశ రాజధానిలో సంచలనంగా మారింది.