ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
ఎన్టీఆర్ జిల్లాలోని మిర్చి శీతల గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో మిర్చి నిల్వలు అన్ని కూడా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో రూ.12 కోట్ల విలువైన మిర్చి ఉన్నట్లు సమాచారం.