![Vijayawada : విజయవాడలో భారీ వర్షం... విరిగిపడిన కొండ చరియలు!](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/hills.jpg)
Heavy Rain : భారీ వర్షాలకు విజయవాడ (Vijayawada) లోని మొగల్రాజపురం వద్ద కొండ చరియలు (Landslides) విరిగిపడిపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Gadde Rama Mohan) ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ దుర్ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా దెబ్బతినగా..మరో మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వీరిలో ఓ బాలిక మృతి చెందినట్లు సమాచారం. పూర్తిగా దెబ్బ తిన్న ఇంట్లో పలువురు చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.