తెలంగాణలోకి మావోయిస్టు అగ్రనేతలు..? | Maoist Prime Leader Sujatha Arrests in Kothagudem, Bhadradri
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తుపాకీ మోత మోగింది. ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వారిలో పాల్వంచ - మణుగూరు- కరకగూడెం డీవీసీఎం లచ్చన్న హతమైనట్లు అధికారులు తెలిపారు.
భద్రాధ్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం మారుతి కళాశాల నర్సింగ్ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారుణ్య తండ్రి గురుమూర్తి ఫిర్యాదుతో సెక్షన్ 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కారుణ్యది హత్యేనని బాధితురాలి తల్లి ఆరోపిస్తుంది.
మిస్టరిగానే మిగిలిపోయిన నర్సింగ్ స్టూడెంట్ కారుణ్య సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూసైడ్ లేఖలో సున్నితమైన అంశాలున్నాయనే కారణంగా లేఖను బహిర్గతం చేయట్లేదని పోలీసులు చెబుతున్నారు. తోటి విద్యార్థుల వేధింపుల కారణంగానే కారణ్య చనిపోయారని ప్రచారం జరుగుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి ఆఫీసర్ అడ్డంగా బుక్కయ్యాడు. అశ్వారావుపేట ట్రాన్స్ కో ఏఈ శరత్ కుమార్ మద్దికొండ గ్రామ రైతు దగ్గర లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కొత్తగూడెంలో నిర్వహించనున్న పార్టీ ప్రచార సభలో పాల్గొంటున్నారు. కొత్త జిల్లాలను కాంగ్రెస్ రద్దు చేయనుందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు ఈ సభలో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వనున్నారు. రేవంత్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
తెలంగాణలో మరో కీచక టీచర్ ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు హైస్కూల్ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన సీతారామయ్యపై కేసు నమోదైంది. దీనిపై విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
సింగరేణి ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ, సీఐటీయూ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే సాంబశివరావును ప్రధాన కార్యాలయంలోకి అనుమతించపోవడంతో ఏఐటీయూసీ కార్మికులు నిరసన చేపట్టి నినాదాలు చేశారు.