Crime: విద్యార్థినిలతో ఉపాధ్యాయుడి రాసలీలలు.. కీచకుడికి విద్యాశాఖ మద్ధతు!

తెలంగాణలో మరో కీచక టీచర్ ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు హైస్కూల్‌ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన సీతారామయ్యపై కేసు నమోదైంది. దీనిపై విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

New Update
Crime: విద్యార్థినిలతో ఉపాధ్యాయుడి రాసలీలలు.. కీచకుడికి విద్యాశాఖ మద్ధతు!

Khammam School Teacher: తెలంగాణలో ఓ ఉపాధ్యాయుడి రాసలీలల ఇష్యూ సంచలనంగా మారింది. విద్యా బుద్దులు నేర్పాల్సిన గురువు.. స్కూల్ విద్యార్థినిలతో వెకిలిచేష్టలకు పాల్పడుతూ పైచాచిక ఆనందం పొందుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమాయక ఆడపిల్లలను మాయమాటలతోపాటు భయాందోళనకు గురిచేస్తూ లొంగదీసుకుని పైచాచిక ఆనందం పొందుతున్న ఆ కీచకుడి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో తట్టుకోలేక పిల్లలంతా తమ తల్లిదండ్రులతో చెప్పగా ఘోరమైన నిజాలు బయటపడ్డాయి.

ఈ మేరకు పోలీసులు, పిల్లల తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు హైస్కూల్‌లో ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడు సీతారామయ్య తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ కొంతమంది ఆడపిల్లలు తమ తల్లిదండ్రులకు గోడు వినిపించారు. దీంతో ఉపాధ్యాయుడిని విద్యార్థుల తల్లిదండ్రులు మందలించారు. ఇదే క్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులకు పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసింది. దీంతో సీతారామయ్య లాంగ్ లీవ్‌ పెట్టి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అయితే ఈ ఇష్యూను విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లినా పెద్దగా పట్టించుకోలేదనే పేరెంట్స్ వాపోతున్నారు. అయితే ఉపాధ్యాయుడు సీతారామయ్య తీరుపై  జిల్లా అధికారులు విచారణ చేపట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: హైదరాబాద్ లో డేంజర్ మామిడి పండ్లు.. తింటే మటాషే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు