Kothagudem: నర్సింగ్ స్టూడెంట్ సూసైడ్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు! మిస్టరిగానే మిగిలిపోయిన నర్సింగ్ స్టూడెంట్ కారుణ్య సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూసైడ్ లేఖలో సున్నితమైన అంశాలున్నాయనే కారణంగా లేఖను బహిర్గతం చేయట్లేదని పోలీసులు చెబుతున్నారు. తోటి విద్యార్థుల వేధింపుల కారణంగానే కారణ్య చనిపోయారని ప్రచారం జరుగుతోంది. By srinivas 28 May 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Nursing College Karunya Sucide Case: ఇప్పటికీ వీడని మిస్టరిగానే మిగిలిపోయిన నర్సింగ్ స్టూడెంట్ కారుణ్య సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారుణ్య సూసైడ్ నోట్‌ను పోలీసులు ఇంతవరకూ బహిర్గతం చేయకపోగా.. సూసైడ్ లేఖలో సున్నితమైన అంశాలున్నాయని, అందుకే గోప్యంగా ఉంచుతున్నట్లు చెబుతున్నారు. సూసైడ్ లేఖ బహిర్గతమైతే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండగా.. దీనిని ఎందుకు కొనసాగిస్తున్నారనే అంశం హాట్ టాపిక్ గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మారుతి పారామెడికల్ కాలేజీలో నర్సింగ్ ఫస్టియర్ చదువుతున్న కారణ్య.. మే 23న తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందుతూ అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో కారుణ్య మరణంపై అనుమానాలున్నాయంటే తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ విచారణలో వెల్లడైన విషయాలను గోప్యంగా ఉంచుండగా.. కారుణ్యను ఇద్దరు విద్యార్థినులు వేధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా పోలీసులు నోరు విప్పితేనే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. Also Read: కుక్కను తప్పించబోయి తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి! #karunya #suicide-case #kothagudem మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి