కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్..
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేటీఆర్ లీగల్ నోటీసును పంపించారు. కేవలం రాజకీయ కక్షతోనే తన పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని లేదంటే పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన అక్కినేని నాగచైతన్య
కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందించారు. ఈ అంశంపై ఆయన డైరెక్ట్‌గా మాట్లాడకపోయినా.. నాగార్జున చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. కాగా రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత.. ఏమన్నారంటే ?
కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందించింది. విడాకులు నా వ్యక్తిగత విషయమని.. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని పేర్కొంది. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది.
కేటీఆర్ కారణంగా సమంత-చైతన్య విడాకులు.. ఆ హీరోయిన్లు కూడా: సురేఖ సంచలన కామెంట్స్
కేటీఆర్ మినిస్టర్ గా ఉన్న సమయంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కొందరు హీరోయిన్లు కేటీఆర్ కారణంగా తొందరగా వివాహం చేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. .
Konda Surekha: ఇలా ట్రోల్ చేస్తారా.. కొండా సురేఖ కన్నీళ్లు-VIDEO
మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి తాను అన్నం తినలేదని.. నిద్ర కూడా పోలేదన్నారు. మహిళ అని కూడా చూడకుండా ఇలా ట్రోల్ చేస్తారా? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
Dubbaka : దుబ్బాకలో రచ్చ రచ్చ.. బీజేపీ Vs బీఆర్ఎస్ Vs కాంగ్రెస్!
దుబ్బాకలో ఈ రోజు జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డిని స్టేజీపైకి ఆహ్వానించడంతో ఈ వివాదం మొదలైంది.
Renu Desai: మంత్రి కొండా సురేఖను కలిసిన రేణు దేశాయ్.. ఎందుకో తెలుసా?
నటి రేణు దేశాయ్ తెలంగాణ మంత్రి కొండా సురేఖను ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. వారిద్దరూ పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు. అనంతరం మంత్రి సురేఖ రేణుదేశాయ్ కు నూతన వస్త్రాలు అందించి సత్కరించారు
బోనం ఎత్తిన మంత్రి కొండా సురేఖ
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిన్న బోనం ఎత్తారు. ఆమె గ్రామం వంచనగిరిలో నిన్న జరిగిన కోట గండి మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాన్ని స్వయంగా ఎత్తుకుని ఆలయం వరకు వెళ్లారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.
/rtv/media/media_files/AFhL9AFKpgZ7nLM6O4Rn.jpg)
/rtv/media/media_files/nuokqx7vz7PTjvtmmjxY.jpg)
/rtv/media/media_files/jzMTJ2o2UL06SfL7HSnA.jpg)
/rtv/media/media_files/lsyB24Z0shyxeON84b7Y.jpg)
/rtv/media/media_files/Pkh1ZuuVsTZOFAv7A6ax.jpg)
/rtv/media/media_files/y8dsYa1WwstMI3ehHUNx.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-26T191452.423.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Konda-surekha-1.jpg)