Renu Desai: మంత్రి కొండా సురేఖను కలిసిన రేణు దేశాయ్.. ఎందుకో తెలుసా?

నటి రేణు దేశాయ్ తెలంగాణ మంత్రి కొండా సురేఖను ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. వారిద్దరూ పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు. అనంతరం మంత్రి సురేఖ రేణుదేశాయ్ కు నూతన వస్త్రాలు అందించి సత్కరించారు

New Update
Renu Desai: మంత్రి కొండా సురేఖను కలిసిన రేణు దేశాయ్.. ఎందుకో తెలుసా?

Renu Desai: ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖను జూబ్లీహిల్స్ లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల పై చర్చించారు. అలాగే భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటిగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణుదేశాయ్ మంత్రి సురేఖకు వివరించారు.

అనంతరం తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్ ను మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. ఆమె కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసును సురేఖ తన చేతులతో రేణుదేశాయ్ కి అలంకరించారు. కొండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల నటి రేణు దేశాయ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

publive-image

publive-image

Also Read: Rajinikanth: మనవడిని స్కూల్‌కు తీసుకెళ్లిన తలైవ.. ఫొటోలు వైరల్..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు