Raja Singh: రాజాసింగ్ యూటర్న్.. తెలంగాణ బీజేపీలో వేగంగా మారుతున్న పరిణామాలు!
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్.. తాజాగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చే దిశగా ఆయన అడుగులు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్.. తాజాగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చే దిశగా ఆయన అడుగులు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించింది. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన రాజీనామాను ఆమోదించారు. రాంచందర్ రావుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల రాజాసింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే రాజాసింగ్ హస్తిన బాట పట్టారు. తాను పార్టీకి రాజానామా చేయడానికి దారి తీసిన పరిస్థితులపై హైకమాండ్ పెద్దలకు ఆయన వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్లపై సైతం ఆయన ఫిర్యాదు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బీజేపీ ఢిల్లీ పెద్దల నిర్ణయం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. హరీష్ రావు తనకు మంచి మిత్రుడని.. అప్పుడప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడుతానని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన హిందూ పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందన్నారు.
బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ స్పందించారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని ఫైర్ అయ్యారు. తమ పార్టీకి వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమన్నారు.