Kishan Reddy: కేసీఆర్ పాలనలో రైతులు గోస పడుతున్నారు
సీఎం కేసీఆర్పై ఎంపీ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రైతులు కేసీఆర్ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్పై ఎంపీ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రైతులు కేసీఆర్ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
సమయం తక్కువ ఉండటం వల్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్నారు. విజయవాడ నుంచి నేరుగా భద్రాచలం వచ్చి సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకునేలా షెడ్యూల్ ఖరారైంది. కానీ చివరి నిమిషంలో షా పర్యటన రద్దు అయిందని బీజేపీ యంత్రాంగం ప్రకటించింది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీకి చెందిన నాయకుడు అమన్ మృతితో షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మేకల కుంట గ్రామంలో పార్టీ యువనేత అమన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల.. అమన్ కుటుంబ సభ్యులను ఓదార్చి, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయం కింద అమన్ కుటుంబానికి షర్మిల 3లక్షలు అందజేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 27 ఖమ్మం రానున్న ఆయన.. అక్కడ జరిగే భారీ బహరింగ సభలో పాల్గొననున్నారు. ఆ సభనుంచే ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమావేశమైన కేంద్ర ఎన్నికల కమిటీ తెలంగాణలో మరో విడత సర్వే చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తన వద్ద ఫోటో తీయించుకుంటే కనుక వారికి ఉచితంగా టమాటాలు ఇస్తానని ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నాడు. దాంతో బుధవారం ఒక్కరోజే అతని వద్ద సుమారు 32 మంది ఫోటోలు తీయించుకున్నారు.
కొద్ది రోజులుగా తెలంగాణను వరుణుడు విడిచిపెట్టడం లేదు. గత రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఖమ్మంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మంలోని మున్నేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో మున్నేరు వాగు పై రాకపోకలు బంద్ అయ్యాయి.