Khammam: బీఆర్ఎస్కు భారీ షాక్.. తుమ్మల బాటలో పలువురు నేతలు
ఖమ్మం జిల్లాలో గత కొద్ది రోజులుగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్లో తుమ్మల చేరడంతో ఖమ్మం రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. తుమ్మల పాలేరు టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్లో చేరగా.. అధిష్ఠానం నుంచి ఆయనకు హామీ వచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. దీంతో తుమ్మల అనుచరులు మూకుమ్మడిగా బీఆర్ఎస్కు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.