Kaleshwaram: కాళేశ్వరం అవినీతి.. కేఏపాల్ పిటిషన్ విచారణ వాయిదా!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ సీబీఐ దర్యాప్తు జరిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ మరో వారానికి వాయిదా వేసింది.