బీజేపీ ఈసీ భేటీ, 15 మంది సభ్యులతో ప్రధాని మేధోమథనం..!!
త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు (Assembly Election 2023)జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని నరేంద్రమోదీ (PM Modi) సర్కార్ ఆయా రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలోనే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈరోజు సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మొత్తం 15 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బలహీన స్థానాలపై పార్టీని బలోపేతం చేయడంతోపాటు ఎన్నికల వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది.