Pawan Kalyan : వైసీపీ భూ కబ్జాలకు పేదలు బలవుతున్నారు : పవన్
ఉమ్మడి కడప జిల్లాలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు భార్యాబిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. సుబ్బారావు కుటుంబం మరణించడం సందేహాలకు తావిస్తోందన్నారు. వైసీపీ నేతల భూ దందాలకు పేదలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.