Pm Modi:జీ7 కోసం ఇటలీకి బయలుదేరిన ప్రధాని మోదీ
గ్లోబల్ సమ్మిట్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇటలీ బయలుదేరారు.మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీకి ఇదే మొదటి విదేశీ పర్యటన. జీ7 చర్చల్లో భాగంగా కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా, గ్లోబల్ సౌత్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.