Italy: బ్రిడ్జి పై నుంచి కింద పడిన బస్సు..పిల్లలతో పాటు 21 మంది మృతి! ఇటలీ(Italy) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road acident) జరిగింది. వెనిస్ (venis) నగరం సమీపంలో మంగళవారం సాయంత్రం పర్యాటకులతో వెళ్తున్న ఓ బస్సు (Bus) అదుపు తప్పి బ్రిడ్జి (Bridge) పై నుంచి కిందకి పడిపోయింది. By Bhavana 04 Oct 2023 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి ఇటలీ(Italy) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road acident) జరిగింది. వెనిస్ (venis) నగరం సమీపంలో మంగళవారం సాయంత్రం పర్యాటకులతో వెళ్తున్న ఓ బస్సు (Bus) అదుపు తప్పి బ్రిడ్జి (Bridge) పై నుంచి కిందకి పడిపోయింది. ఈ బస్సు కింద పడే సమయంలోనే మంటలు చెలరేగాయి. బస్సు మీథేన్ తో నడవడమే ఇందుకు కారణం. ఈ ప్రమాదంలో సుమారు 21 మంది మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 41 మంది ఉన్నారు. వారిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్న పిల్లలతో పాటు 21 మంది విదేశీయులు దుర్మరణం పాలయ్యారు. 20 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన బస్సు పర్యాటకులను తీసుకుని వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసు అధికారులు, అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న వెనిస్ మేయర్ లుయిగి బ్రుగ్నారో సంతాపం తెలిపారు. ఇది ఇటలీలో ఘోరమైన ప్రమాదంగా తెలిపారు. ఈ ప్రమాదంలో ఇటాలియన్లు మాత్రమే కాకుండా ఇతర దేశాల ప్రజలు కూడా ఉన్నట్లు మేయర్ తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు వెనిస్ లోని చారిత్రాత్మక కేంద్రం నుంచి క్యాంపింగ్ ప్రదేశానికి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలిపారు. బస్సు రైలు మార్గాన్ని దాటే క్రమంలో వంతెన పై నుంచి కిందపడినట్లు తెలుస్తుంది. బస్సు మీథెన్ గ్యాస్ తో నడవడం వల్ల కింద పడే సమయంలో విద్యుత్ తీగల పై పడి ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం పూర్తిగా తెలియలేదు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. '' ఈ ఘోర ప్రమాదానికి తాను..తన ప్రభుత్వం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు తెలిపారు. దీని గురించి ప్రభుత్వం తరుఫున నుంచి అధికారులు అన్ని సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. #bus-accident #mythen #gas #italy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి