International: ప్రపంచాధినేతలను నమస్తేతో ఇటలీ ప్రధాని పలకరింపు..

ఇటలీలో జీ7 సమ్మిట్ జరుగుతోంది. జూన్ 13, 14 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు ప్రపంచాధినేతలు ఇటలీకి చేరుకున్నారు. వీరందరినీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్వయంగా ఆహ్వానిస్తూ అందరికీ నమస్కారం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

New Update
International: ప్రపంచాధినేతలను నమస్తేతో ఇటలీ ప్రధాని పలకరింపు..

Giorgia Meloni :ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు. జీ7 సదస్సు సందర్భంగా ప్రపంచస్థాయి అధిపతులను ఆమె స్వయంగా ఆహ్వానించారు. అయితే ఆమె ఆహ్వానించి పద్ధతి అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆ వీడియోలు కాస్తా వైరల్‌గా మారాయి. జీ7కు వచ్చిన అధినేతలందరికీ మెలోనీ నమస్కారం పెడుతూ ఆహ్వానించారు. ఆసియా దేశాల్లో తప్ప నమస్కారం మిగతా దేశాల్లో లేదు. అలాంటిది ఇటలీ ప్రధాని ఇప్పుడు మన దేశాల సంస్కృతిని ఫాలో అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

గతంలో ఇటలీ ప్రధాని మెలోనీ, భారత ప్రధాని మోదీకి సంబంధించి వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. వాటి మీద బోలెడు మీమ్స్ కూడా వచ్చాయి.తాజాగా మరోసారి జార్జియా మెలోనీ నమస్తే పలకరింపుతో వైరల్ అయ్యారు.దీనిపై నెటిజన్లు తెగ రెస్పాండ్ అవుతున్నారు.

ఇక ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు జీ7 దేశాల ఇయర్లీ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మీద ఈరోజు ఇటలీ బయలుదేరారు. ఈ శిఖారగ్ర సమావేశంలో పాల్గొంటున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల భారత్‌లో జరిగిన జీ 20 సమీవేశాలను ఇప్పుడు జీ7 సమ్మిట్ ఫలితాలతో సమస్వయం చేసేందుకు ప్రయత్నిస్తానని ప్రధాని మోదీ చెప్పారు. గ్లోబల్ సౌత్‌కు కీలకమైన అంశాలపై చర్చించడానికి ఇది ఒక అవకాశమని ఆయన అన్నారు.జీ7 చర్చల్లో భాగంగా కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా, గ్లోబల్‌ సౌత్‌ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు.

Also Read:Tmili Sai: అబ్బే అదేం కాదు..అమిత్ షాతో మాటలపై క్లారిటీ ఇచ్చిన తమిళిసై

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు