ISRO: ఇస్రో మరో విజయం.. జాబిల్లి కక్ష్య నుంచి భూకక్ష్య దిశగా ప్రొపల్షన్ మాడ్యుల్..
ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్ మాడ్యుల్‌ను చంద్రుని కక్ష్య నుంచి భూ కక్ష్య వరకు మళ్లించినట్లు ఇస్రో ప్రకటన చేసింది. కక్ష్య పొడగింపు, ట్రాన్స్ ఎర్త్ ఇంజెక్షన్ విన్యాసాలతో దీన్ని పూర్తి చేసినట్లు పేర్కొంది.