ISRO: మరో ఘనత సాధించిన ఆదిత్య ఎల్1.. సౌరజ్వాలను క్లిక్‌మనిపించిన వ్యోమనౌక
ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1 మరో ఘనతను సాధించింది. ఆ వ్యోమనౌకలో ఉన్న 'హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్' మొదటిసారి సౌర జ్వాలలకు సంబంధించి హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని ఫొటో తీసింది. ఈ పరికరంతో పూర్తిస్థాయి పరిశీలనలు చేసేందుకు సిద్ధమవుతోంది ఇస్రో.