ISRO: నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F14 రాకెట్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F14 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F14 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేడు మరో ప్రయోగం చేపట్టనుంది. వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. GSLV-F14 శాటిలైట్ శనివారం సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించనున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి రెడీ అయింది. రేపు షార్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ 14 రాకెట్‌ను నింగిలోకి పంపించనుంది. రేపు సాయంత్రం పంపించే రాకెట్‌కు ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి కౌంట్ డౌన్ స్టార్ చేశారు.
మరో 14 నెలల్లో దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నామని ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) ప్రకటన చేసింది. ఇందులో ఏడు గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించినవి ఉన్నాయని.. స్కైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేటు సంస్థల ప్రయోగాలున్నాయని చెప్పింది.
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో. వివిధ విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 224 జాబ్స్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇస్రో.
దేశం రామనామస్మరణతో మారుమోగుతోంది. ఈ వేళ అయోద్య నగరానికి సంబంధించి ఓ అపూర్వ చిత్రాన్ని ఇస్రో షేర్ చేసింది. ఇస్రోకు చెందిన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంతరిక్షం నుంచి రామ మందిరం ఎలా ఉందో తెలిపే అయోధ్య ఫొటో క్లిక్ అనిపించింది.
ఇస్రో చరిత్రలో మరో మైలు రాయిని తాకింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో పంపిన ఆదిత్య ఎల్-1 సంపూర్ణ విజయం సాధించింది. తుది కక్షలోకి ఆదిత్య ఎల్-1 చేరింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు.
మళ్లీ చరిత్ర సృష్టించేందుకు ఇస్రో కొన్ని అడుగులు దూరంలో ఉంది. ఆదిత్య-ఎల్1 నేడు గమ్యాన్ని చేరుకోనుంది.ఆదిత్య-ఎల్1 సూర్యుడిని అధ్యయనం చేయడానికి అంతరిక్షంలో ఏర్పాటు చేయబడిన మొదటి భారతీయ అబ్జర్వేటరీ. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ-సీ57) ఆదిత్యతో బయలుదేరింది.
ఈ నెలలో ఇస్రో మరో చరిత్ర సృష్టించబోతోంది. ఆదిత్య ఎల్1 త్వరలో లాగ్రాంజ్ పాయింట్ (ఎల్1)కు చేరుకుంటుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. జనవరి 6, 2024న సాయంత్రం 4 గంటలకు L1 పాయింట్‌కి చేరుకుంటుంది.