దారుణమైన యుద్ధం | Iran Attack on Israel Live | Lebanon | Hezbollah | Iran Israel War Update | RTV
పశ్చిమాసియా భగ్గుమంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ దాడులకు దిగింది. క్షిపణుల వర్షం కురిపించడంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన ఈ ప్రతీకార దాడులకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.
మంగళవారం రాత్రి ఇరాన్.. ఇజ్రాయెల్‌పై దాదాపు 200 క్షిపణులతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలి భారత ప్రజలకు సూచనలు చేసింది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ముదిరింది. ఉదయం నుంచి హిజ్బుల్లాపై క్షిపణులతో ఇజ్రాయెల్ ఎటాక్ చేస్తోంది. హిజ్బుల్లా కూడా కౌంటర్ అటాక్‌కు దిగింది. వార్ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో విమాన సేవలు నిలిపివేశారు.
ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ఇరాన్ పక్కా ప్లాన్ వేస్తోంది. యుద్ధం కంటే ముందే హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మొస్సాద్లో ఇజ్రాయెల్ కీలక కమాండర్స్‌ని అంతం చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇందుకోసం డేట్ ఫిక్స్ చేసి, మరికొన్ని దేశాల మద్దతుతో అటాక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
తమ దళాలపై హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా 10 నెలలుగా బీభత్సాన్ని సృష్టిస్తోంది ఇజ్రాయెల్. భీకరమైన దాడులతో 5 దేశాల్లో రక్తపాతం సృష్టిస్తూ 41 వేల మంది సామాన్యులను పొట్టనబెట్టుకుంది. ఇజ్రాయెల్ పదే పదే కవ్వింపు చర్యలతో ప్రపంచం మరో యుద్ధం అంచున నిలబడిందంటున్నారు విశ్లేషకులు.