వీడిన మిస్టరీ! అది భారత్ PSLV రాకెట్ భాగమే: ఏఎస్ఏ స్పష్టీకరణ
గతకొంతకాలంగా ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుచిక్కని వస్తువు ఎక్కడినుంచి వచ్చిందనే మ్యాటర్ అప్పట్లో మిస్టరీగా మారింది. ఇవాల్టితో దాని మిస్టరీని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేధించారు. ఈ వస్తువు భారత్‌కు చెందిన రాకెట్‌దేనని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ (ASA) అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఉత్తరాన రెండు గంటల ప్రయాణంలో ఉన్న జురియన్ బే సమీపంలో జూలై వారంలో ఈ వస్తువు తొలిసారిగా కనిపించింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.