వేగంగా పెరుగుతున్న భారతీయుల సంపద..... గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ లో సంచలన విషయాలు....!
యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (UBS)'గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2023' పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. భారత ప్రజల సంపద అత్యంత వేగంగా పెరుగుతోందని పేర్కొంది. దేశంలో పెద్దలకు సగటు ఆస్తులు సుమారు రూ. 14 లక్షలు ఉన్నట్టు తెలిపింది. దేశ ప్రజల సంపద ఇలానే పెరుగుతూ పోతే త్వరలోనే భారతీయులు ధనవంతులు అవుతారని పేర్కొంది.