రాజస్థాన్ చుట్టూ యుద్ధ విమానాలు | India Pak War Live Updates | High Tension In Border | RTV
పాకిస్తాన్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ గురువారం పాకిస్తాన్ FM రేడియో స్టేషన్లలో భారతీయ పాటలపై నిషేధం విధించింది. పాకిస్తానీ FM రేడియో స్టేషన్లలో భారతీయ పాటల ప్రసారాన్ని తక్షణమే నిలిపివేసిందని PBA సెక్రటరీ జనరల్ షకీల్ మసూద్ తెలిపారు.
భారత నిఘా సంస్థలు పాకిస్తాన్ కొత్త పన్నాగాన్ని బయటపెట్టాయి. దీంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్, మయన్మార్ సాయంతో భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. ఆయా సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించింది.
ఇండియా నుంచి పాకిస్తాన్‌కు పోస్టల్, పార్శిల్ సర్వీసులు నిలిపివేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. అలాగే పాకిస్తాన్ షిప్పులు మన ఓడరేవుల్లో ప్రవేశాన్ని నిషేధించనున్నట్లు సమాచారం. పాకిస్తాన్‌తో 1971 యుద్ధం సమయంలో అప్పటి PM ఇందిరా గాంధీ అదే నిర్ణయం తీసుకున్నారు.
ఎమర్జెన్సీ విధించే దిశగా పాకిస్తాన్ పాలన నడుస్తోంది. భారత్ ఎప్పుడు సర్జికల్ స్ట్రైయిక్స్ చేస్తోందో అన్న భయంతో పాకిస్తాన్ ఎయిర్ పోర్టులు మూసేశారు. నెల రోజులపాటు పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్ సిటీల్లో విమానాలు ఎగరడాన్ని నిషేధించారు.