Income Tax: ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. హెచ్ఆర్ఏ క్లెయిమ్స్ పై ఐటీ శాఖ కీలక నిర్ణయం.!
ఇంటి అద్దె అలవెన్స్ క్లెయిమ్స్ విషయంలో పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. పాత కేసులను తిరిగి తెరుస్తున్నారన్న వార్తలను ఖండిస్తూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.