Hyderabad Police : మందుబాబులకు హైదరాబాద్ పోలీసుల షాక్.. ఆ రోజున మద్యం షాపులు బంద్!
హోలీ పండుగ సందర్భంగా మందుబాబులకు షాకిచ్చారు హైదరాబాద్ పోలీసులు. మార్చి 25వ తేదీ ఉదయం 6గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6గంటల వరకు మద్యం షాపులను మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.