Same Sex Marriage : స్వలింగ వివాహాలపై సుప్రీం తీర్పు..అసలు హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో ఏముంది?
ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కుల వివాహంపై చాలా దేశాలు చట్టబద్దతను కల్పించాయి. వాటిలో దాదాపు 30కిపైగా దేశాల్లో అమల్లో ఉంది. భారత్ లో కూడా స్వలింగ వివాహాలపై చట్టబద్దత కల్పించే విషయంపై సుప్రీంకోర్టు గత ఐదు నెలల క్రితమే వాదనలు జరిపింది. 5 నెలల నుంచి సుదీర్ఘ వాదనల తర్వాత ధర్మాసనం తీర్పును వెలువరించింది. భారతదేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాలు ఉన్న ఈ కేసులో మంగళవారం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేసేందుకు సుప్రీంకోర్టు ఎందుకు నిరాకరించింది? అసలు హిందూ వివాహ చట్టం ఏం చెబుతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.