Calcutta High Court: అమ్మాయిలు లైంగిక కోరికలు నియంత్రించుకోవాలి.. కలకత్తా హైకోర్టు సూచనలు
టీనేజీలో ఉండే.. అమ్మాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంటూ కలకత్తా హైకోర్టు సూచించింది. రెండు నిమిషాల సుఖం కోసం లొంగిపోకూడదని.. సమాజంలో ఇది ఆమె గౌరవాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. అలాగే అబ్బాయిలు కూడా మహిళల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని తెలిపింది. పరస్పర సమ్మతితో శృంగారంలో పాల్గొనే కేసుల్లో.. పోక్సో చట్టాన్ని ప్రయోగించే అంశంపై కలకత్తా హైకోర్టు ఈ హైకర్టు ఇలా వ్యాఖ్యానించింది.