Hemant Soren: మాజీ సీఎంకు సుప్రీం కోర్టు షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తనకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు.. ఆ పిటిషన్‌ను కొట్టేసింది. కాగా మనీలాండరింగ్ కేసులో ఆయనను ఈడీ జనవరిలో అరెస్ట్ చేసింది.