ఎన్నికల వేళ హెలికాప్టర్ ఆపరేటర్లకు జాక్ పాట్!
దేశంలోని హెలికాప్టర్ ఆపరేటర్లు గత రెండు నెలలుగా డబ్బులో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి భారీగా డబ్బు ఖర్చు చేయడంతోపాటు హెలికాప్టర్ సేవలను వినియోగించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం.