Dubai : ఎడారి దేశంలో భీకర వాన... మునిగిపోయిన దుబాయ్
దుబాయ్ నగరాన్ని ఉన్నట్టుండి వానలు ముంచెత్తాయి. మొత్తం నగరం అంతా నీటితో నిండిపోయింది. ఎక్కడివక్కడ నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది.
దుబాయ్ నగరాన్ని ఉన్నట్టుండి వానలు ముంచెత్తాయి. మొత్తం నగరం అంతా నీటితో నిండిపోయింది. ఎక్కడివక్కడ నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది.
వేసవి వేడితో అదిరిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు తీసుకువచ్చింది. ఈ ఏడాది ఎండలు ఎంత ఎక్కువ ఉన్నాయో.. అలానే వర్షాలు కూడా అంతే ఎక్కువగా ఉండొచ్చని IMD తన అంచనాలలో పేర్కొంది. రుతుపవనాల సీజన్లో వర్షాలు ఎక్కువగా పడే ఛాన్స్ ఉందని IMD ప్రకటించింది.
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీర్ఘకాలిక సగటు వర్షాపాతం 87 సెంటీమీటర్లు ఉండగా.. ఈ ఏడాది 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
అఫ్గానిస్తాన్‌లో భారీ వరదలు సంభవించాయి. వీటి ప్రభావానికి 33 మంది మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. అలాగే 600లకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని.. 200 పశువులు మృతి చెందాయని, 800 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తాలిబాన్ అధికారులు తెలిపారు.
మిచౌంగ్ తుపాన్ ప్రభావానికి అతలాకుతలమైన చెన్నై నగరం కాస్త తెరుకున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి అక్కడ వర్షం పడటం లేదు. దీంతో అధికారులు భారీ వర్షాల కారణంగా నిలిచినపోయిన విమాన రాకపోకల సేవలను పునరుద్ధరించారు.
ఏపీలో కొనసాగుతున్న మిచౌంగ్ తుపాన్ మరికొన్ని గంటల్లో బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
మిచౌంగ్ తుపాను వల్ల చెన్నైలో జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. రోడ్లపైకి భారీగా వరద రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. అలాగే చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వే పైకి భారీగా వరద చేరింది. దీంతో అధికారులు విమానాల రాకపోకలను నిలిపివేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.
తమిళనాడుకు తుపాను ప్రమాదం పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండంతో రాష్ట్రమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ వాయుగుండం తుపానుగా మారి రానున్న రోజుల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ ప్రభావంతో మొత్తం 16 విమానాల దారి మళ్లించినట్లు ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే కాలుష్య కొరల్లో చిక్కుకున్న ఢిల్లీలో వర్షాలు కురవడం వల్ల కాలుష్యం కొంతవరకు తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.