AP politics: దమ్ముగా తల ఎత్తుకునేలా చేశారు: మంత్రి జోగి రమేశ్
వెన్నంటే ఉండి మీ తండ్రికి ఎలా వెన్ను పోటు పొడిచాడో చెప్పాలని నారా భువనేశ్వరిపై మండిపడ్డారు మంత్రి జోగి రమేశ్. నిజం గెలిచింది.. నిజం నిగ్గు తేలింది.. కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని విరుచుకుపడ్డారు. ఇక తెనాలి రూరల్ మండలం కొలకలూరు నుంచి సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రారంభమైయింది. జెండా ఊపి బస్సు యాత్రను రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేశ్, జోగి రమేశ్ ప్రారంభించారు