TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం.. నోటిఫికేషన్లకు లైన్ క్లీయర్
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. దీంతో నూతన చైర్మన్, సభ్యుల కమిటీ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఫిబ్రవరిలో 20 వేల ఉద్యోగాల భర్తీ నేపథ్యంలోనే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.