Andhra Pradesh : ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఐపీఎస్ ద్వారకా తిరుమల రావు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం ఈయన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఐపీఎస్ ద్వారకా తిరుమల రావు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం ఈయన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కార్యనిర్వాహక అధికారిగా... 1997బ్యాచ్ సీనియర్ IAS అధికారి జె.శ్యామల రావును నియమించారు. ప్రభుత్వం మారగానే పాత ఈవో సెలవుపై వెళ్ళారు.
మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక తన ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదని అన్నారు కాంగ్రెస్ ముఖ్య నేత శశిథరూర్. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ లభించనందువల్ల సంకీర్ణ ప్రభుత్వం అవసరమైంది. ఈ నేపథ్యంలో శశిథరూర్ ఈ వ్యాఖ్యలను చేశారు.
ఏపీకి డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. సెలవులనూ తిరస్కరిస్తోంది.
తాము మళ్ళీ అధికారంలోకి వస్తే దేశమంతటా యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తామని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గౌహతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన...తమ మేనిఫెస్టోలో ఈ అంశం ఉందని...దాన్ని తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఈ నెల 11నుంచి పథకాన్ని అమలుచేయాలని భావిస్తోంది ప్రభుత్వం. భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడ్లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
సరోగసీ నింబధనల్లో మార్పులు చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం ఇక మీదట దాతల నుంచి కూడా వీర్యం, అండాలను తీసుకోవచ్చని చెప్పింది.
తెలంగాణ అసెంబ్లీలో నేడు ఆరవ రోజు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. దాంతో పాటూ ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.