ISRO: గగన్యాన్ మిషన్లో కీలక పరీక్షలకు సిద్ధమైన ఇస్రో..
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మరో పరీక్షకు సిద్ధమైపోయింది. ప్రతిష్ఠాత్మక గగన్యాన్ ప్రోగ్రామ్లో వినియోగించేటటువంటి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 వాహకనౌక తొలి పరీక్షను శనివారం నిర్వహించనుంది. అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లేందుకు గగన్యాన్ మిషన్ ప్రయోగాల్లో భాగంగా ఇస్రో ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఇందులో భాగంగానే ముందుగా క్రూ మాడ్యూల్లోని సిబ్బంది తప్పించుకునే వ్యవస్థ పనితీరును పరీక్షిస్తోంది.