Bathukamma : ఒక్కేసి పువ్వేసి చందమామ..పువ్వుపువ్వుకో సుగుణం...రంగురంగులో ఔషధం
ఎంగిలిపూల బతుకమ్మతోఈ రోజు ప్రారంభమయ్యే బతుకమ్మ నవరాత్రులు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులూ ప్రకృతిలో లభించే ప్రతి పువ్వునూ ఏరికోరి తెచ్చి, బతుకమ్మలను పేరుస్తారు. బతుకమ్మ కోసం ఉపయోగించే ప్రతి పూవులోనూ ఔషధగుణాలు ఇమిడి ఉన్నాయి.