Siddipet Suicide: ఆర్థిక ఇబ్బందులతో భార్యభర్తల సూసైడ్..నులుగురు పిల్లల్ని అనాథలుగా వదిలి...
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. కూలీ పనులు చేసుకుంటనే నాలుగు వేళ్లు నోట్లోకి పోయేది. దీనికి తోడు నలుగురు పిల్లల పోషణ మరింత భారంగా మారింది. దీంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. మనస్తాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది.