Kishan Reddy: కేసీఆర్ పాలనలో రైతులు గోస పడుతున్నారు
సీఎం కేసీఆర్‌పై ఎంపీ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్‌పై ఎంపీ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు.. వర్షాలు పడాలని వినూత్నంగా ప్రత్యేకమైన పూజలతో పాటు, ఆచార వ్యవహారాలు పాటిస్తారు. గ్రామ సమీపంలోని నాలుగు కిలో మీటర్ల దూరంలోని కొండపై ఉన్న అమ్మవారి ఆలయానికి డప్పు వాయిద్యాలతో వెళ్తారు. అక్కడ అమ్మవారికి కోడి లేదా మేకను బలి ఇస్తారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న సరుకులతో అక్కడే 'వరద పాయసం' తయారు చేసుకుంటారు. దాన్ని అక్కడ కొండపైనే నేలపై వేసుకుని.. నాలుకతో ఆ వరద పాయసాన్ని స్వీకరిస్తారు రైతులు. ఇలా చేస్తే వర్షాలు బాగా కురిసి.. పంటల బాగా పండుతాయని వారి నమ్మిక.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో గల్ఫ్ దేశాలకు చెందిన ఎన్నారైలు సమావేశమయ్యారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్‌తో భేటీ అయిన ఎన్నారైలు.. పవన్ రైతులను ఆదుకుంటున్నారని, తాము కుడా రైతులకు ఆదుకోవాలని వచ్చినట్లు తెలిపారు. అందుకోసం ఎన్నారైలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కోటి రూపాయల చెక్కును అందజేశారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.ఇకపై ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనున్నారు.దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ నిర్ణయంతో 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు అధికారులతో సబ్‌కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వరదల వల్ల రైతులు తీవ్ర నష్టపోయారు.
బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేత యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అనీల్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బీఆర్ఎస్లో చేరారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పీ వారిని బీఆర్ఎస్లోకి అహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చేసి ఇతర పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్లోకి వస్తున్నారన్నారు.
దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు పడుతుండటంతో భారత వాతావరణ శాఖ రైతులకు కీలక సూచనలు చేసింది. పంటలను కాపాడుకోవడానికి కొన్ని సలహాలను అనుసరించాలని తెలిపింది. అదే సమయంలో భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.