Amaravati : తిరుమలకు రాజధాని రైతుల పాదయాత్ర!
రాజధాని పనులు తిరిగి ప్రారంభమైతే తిరుమలకు పాదయాత్రగా వస్తామని గతంలో అమరావతి రైతులు మొక్కుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజధాని పనుల్లో కదలిక రావడంతో తిరుమల వెంకటేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, మొక్కు చెల్లించుకోవడానికి రైతులు యాత్ర మొదలు పెట్టారు.