Etela Rajender : సీఎం రేవంత్కు ఈటల సవాల్
TG: సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు బీజేపీ నేత ఈటల రాజేందర్. హైదరాబాద్లో భూములు అమ్మకుండా రైతు రుణమాఫీ చేయాలని అన్నారు. మీరు రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
TG: సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు బీజేపీ నేత ఈటల రాజేందర్. హైదరాబాద్లో భూములు అమ్మకుండా రైతు రుణమాఫీ చేయాలని అన్నారు. మీరు రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
కేసీఆర్లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా నాయకులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వ్యాపారులను కొంటున్నారని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ సంచలన సవాల్ విసిరారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీని ఒకేసారి అమలు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు.
తనకు మల్కాజ్గిరి ఏంటి సంబంధం అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఈటల రాజేందర్. తను ఒక కులానికో, ప్రాంతానికో, మతానికి సంబంధించిన బిడ్డ కాదని.. తెలంగాణ బిడ్డను అని అన్నారు. తాను ఇప్పటివరకు ఏ నాయకుడిని వ్యక్తిగత దూషణలు చేయలేదని తెలిపారు.
తెలంగాణలో బీజేపీ 10కిపైగా ఎంపీ సీట్లు గెలుస్తుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. విజయసంకల్ప యాత్రలో భాగంగా గజ్వేల్ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బీర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ అధికారంలోనే 2జి స్పెక్ట్రమ్, కోల్ మైన్, ఫెర్టిలైజర్ స్కామ్స్ జరిగాయని విమర్శించారు.
మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ నేతల ఈటల రాజేందర్ లైన్ క్లియర్ అయ్యింది. ఈటల వైపే అమిత్ షా మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మురళీధరరావు కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావించినా.. ఈటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ రోజు తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ సీనియర్లకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వ్యతిరేకంగా మాట్లాడొద్దు, లీకులు ఇవ్వొద్దని అమిత్ షా నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వార్ పై కూడా ఆయన సీరియస్ అయినట్లు సమాచారం.
తెలంగాణ బీజేపీలో ముసలం నెలకొంది. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్లా పరిస్థితి మారింది. రాష్ట్రంలో బీజేపీ ఓటమి మీరు కారణం అంటే.. మీరే కారణం అంటూ ఇరు వర్గాలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు.