ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు తప్పిన ప్రమాదం.. ఆయన కారును ఢీకొట్టిన లారీ!
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.
తెలంగాణ లో ఎన్నికలు ఈ నెల 30 న జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. కాబట్టి నవంబర్ 29, 30 తారీఖుల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొత్తగూడెంలో ఎన్నికల గేమ్ షురూ అయింది. వనమా నామినేషన్ ను తిరస్కరించండి అంటూ ఇండిపెండెంట్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. వనమా ఎన్నికల అఫిడవిట్ తప్పుగా ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకర్షించేందుకు రామగుండానికి చెందిన కొంత మంది అభ్యర్థులు ఉచితంగా టపాసులు, మద్యం అందిస్తున్నట్లు సమాచారం.
డిసెంబర్ రెండో వారంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చాక కొద్ది రోజులకే ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే డిసెంబర్ 25 క్రిస్మస్ ముందే ఈ సమావేశాలు ముగుస్తాయని సమాచారం.
తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలకు పార్టీలన్నీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతున్నాయి. ఫలితాలు ఎలా వచ్చినా ముందు వెళ్ళేలా ప్లాన్ బి, సిలు రెడీ చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే హంగ్ వస్తే ఏం చేయాలన్న దాని మీద కూడా కసరత్తులు చేస్తున్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి తృటిలో ప్రమాదం తప్పింది. రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన రథాన్ని కరెంట్ తీగ తాకి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో సిబ్బంది అప్రమత్తం అయ్యి కరెంట్ సరఫరా నిలిపివేశారు.
ఛత్తీస్ఘడ్ లో మహదేవ్ యాప్ కలకలం సృష్టిస్తోంది. దీని మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందిస్తూ నవంబర్ 17 వరకు ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్ చేశారు. దీనిద్వారా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీయాలని చూస్తున్నారని విమర్శించారు.