Assembly Elections:ఛత్తీస్‌ఘడ్, మిజోరంలలో మొదలైన పోలింగ్
ఛత్తీస్ ఘడ్, మిజోరం లలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఛత్తీస్ ఘడ్ లో మొదటి విడత 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మిజోరంలో 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 నుంచి పోలింగ్ మొదలయ్యింది.
ఛత్తీస్ ఘడ్, మిజోరం లలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఛత్తీస్ ఘడ్ లో మొదటి విడత 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మిజోరంలో 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 నుంచి పోలింగ్ మొదలయ్యింది.
నేను ఎన్నికల విధులకు హాజరు కావాలంటే..నాకు పెళ్లి చేయాలంటున్నాడు ఓ ఉపాధ్యాయుడు. దాంతో అతన్ని కలెక్టర్ సస్పెండ్ చేశారు.
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందులో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేయాలనుకునేవారు మాత్రం ఈరోజు నుంచి 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎలక్షన్స్‌లో నగదు పాత్రను తగ్గించాల్సన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల బాండ్ల ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను సమర్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్యర్థి గాడిదపై వెళ్లి నామినేషన్ వేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. దేశంలో వంశ పారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఇలా గాడిదపై వచ్చి నామినేషన్ వేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ఎన్నికల కోసం బీజెపీ తన మొదటి జాబితాను సిద్ధం చేసుకుంది. 55 మంది అభ్యర్ధులతో కూడిన ఈ లిస్ట్ కు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. మరికొంత సేపటిలో తొలి జాబితాను ప్రకటిస్తారని సమాచారం.
ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ఈ - ఓటరు గుర్తింపు కార్డు ద్వారా ఓటు వేయవచ్చని తెలిపింది. దాన్ని ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. దాన్ని ఈజీగా డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు కూడా. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో కీలక మార్పులు చేసినట్లు పేర్కొంది.
తెలంగాణలో అసెంబ్లీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో అన్ని పార్టీలు సమరానికి సై అంటున్నాయి. అందరికంటే ముందు బీఆర్ఎస్ ప్రచారంలోకి దిగిపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. అక్టోబర్ 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.