Telangana Assembly Speaker : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నికకు నోటిషికేషన్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎల్లుండి 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ల గడువు విధించారు. 14వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎల్లుండి 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ల గడువు విధించారు. 14వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల మూడులోకి వెళ్లే సమయం దగ్గరపడింది. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాలకు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇవాళ ఈసీ ఐదు రాష్ట్రాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరంలో ఎన్నికలు నిర్వహించే తేదీలను వెల్లడించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్లోనే లోక్ సభ ఎన్నికలను నిర్వహించేందుకు బీజేపీ రెడీ అవుతోందని ఆమె అన్నారు. క్యాంపెయిన్ కోసం ఇప్పటికే అన్ని హెలికాప్టర్లను కమల నాథులు బుక్ చేశారని వెల్లడించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈ సారి దేశం 'నిరంకుశ' పాలనను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి షాక్ తగిలింది. ఎమ్మెల్యేగా ఆయనను తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. దీంతో 2018 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన డీకే ఆరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన డీకే అరుణ 73వేల612 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లక్షా 57 ఓట్లు సాధించి గెలుపొందారు.