AP : ఏపీలో మూడు రోజుల పాటు మందు షాపులు బంద్...!
ఏపీలోని మందు బాబులకు మింగుడుపడని వార్త...రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూసివేయనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో సోమవారం నుంచి బుధవారం వరకు మద్యం షాపులను మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.