By Polls : దేశంలో మోగిన మరో ఎన్నికల నగారా.. ఆ 7 రాష్ట్రాల్లో ఎలక్షన్స్!

దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు జులై 10న పోలింగ్, జులై 12న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారని తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి..

New Update
By Polls : దేశంలో మోగిన మరో ఎన్నికల నగారా.. ఆ 7 రాష్ట్రాల్లో ఎలక్షన్స్!

By Polls In 13 Assembly Seats : దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు (By Elections) జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ (EC) షెడ్యూల్ రిలీజ్ చేసింది. 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు జులై 10న పోలింగ్, జులై 12న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారని తెలిపింది. ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ (Polling) జరగనుందో తెలుసుకుందాం..

Also Read: అమరావతి ఇప్పుడెలా ఉంది? నిర్మాణాలు పనికి వస్తాయా?

ఉపఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు ఇవే..

పశ్చిమ బెంగాల్‌ లోని రాయ్ గంజ్, రణఘాట్ సౌత్, బాగ్దా, మాణిక్తలా -  4
హిమాచల్ ప్రదేశ్ లోని డెహ్రా, హమీర్పూర్, నలగర్ - 3
ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్, మంగళూరు -  2
బీహార్ - రూపాలి నియోజకవర్గం - 1
తమిళనాడులోని విక్రవాండి - 1
మధ్యప్రదేశ్ లోని అమరవాడ 1
పంజాబ్‌ లో జలంధర్ వెస్ట్ - 1

ఈ ఉప ఎన్నికలకు జూన్ 14 నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. నామినేషన్ దాఖలుకు జూన్ 21 చివరి తేదీ.  జూన్ 24 వరకు నామినేషన్ పరిశీలన, ఉపసంహరణకు జూన్ 26 వరకు చివరి తేదీ ఉంటుందని ఈసీ వెల్లడించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు