Duvvada Srinivas: బిగ్ బాస్ ఇంట్లో మాధురి రిలేషన్స్.. దువ్వాడ ఎమోషనల్ వీడియో వైరల్!

వ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్.. ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా, ఏం చేసిన నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంటుంది. తాజాగా దివ్వెల మాధురి బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టడంతో ఈ జంట మరింత హాట్ టాపిక్ గా మారింది.

New Update
Duvvada Srinivas On Bigg Boss

Duvvada Srinivas On Bigg Boss

 Duvvada Srinivas: దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్.. ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా, ఏం చేసిన నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంటుంది. తాజాగా దివ్వెల మాధురి బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టడంతో ఈ జంట మరింత హాట్ టాపిక్ గా మారింది. షోలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే దడదడలాడిస్తున్నారు మాధురి. వచ్చిరాగానే హౌజ్ లో పవన్ కళ్యాణ్, దివ్యతో గొడవేసుకొని హౌజ్ ను హీటెక్కించారు. తన ఆట, మాటతో ఎవ్వరికీ భయపడేదేలే  అన్నట్లుగా దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఆర్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న దువ్వాడ శ్రీనివాస్.. బిగ్ బాస్ ఇంట్లో దివ్వెల మాధురి ఆటతీరు గురించి పలు విషయాలు పంచుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ..  బిగ్ బాస్ కి వెళ్ళేది బంధాలు పెట్టుకోవడానికి కాదు ఆట కోసం.. మాధురి వెళ్లిన తర్వాత బిగ్ బాస్ ఇంట్లోని బంధాలన్నీ పటాపంచలయ్యాయి. షో కోసం ఫేక్ రిలేషన్స్ పెట్టుకోవడం ఎందుకు అని మాధురీ ప్రశ్నించింది. బయట 5 వారల పాటు చూసిన గేమ్ ప్రకారమే.. మాధురి అక్కడ రియాక్ట్ అవుతుంది. తన గేమ్ తాను కరెక్ట్ గా ఆడుతోంది అని తెలిపారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, దివ్యతో కిచెన్ లో జరిగిన గొడవ గురించి దువ్వాడను  ప్రశ్నించగా.. అక్కడ కూడా మాధురి తప్పేం లేదని చెప్పారు. ఆమె మాట్లాడిన తీరు తప్పు కావచ్చు.. కానీ, ఆమె చెప్పిన పాయింట్స్ సరైనవే.. హోస్ట్ నాగార్జున కూడా ఇదే విషయాన్ని చెప్పారని బదులిచ్చారు. 

మాధురి రిలేషన్స్ పెట్టుకుంటరా?

ఆ తర్వాత  మాధురి ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోకుండా హౌజ్ నుంచి బయటకు వస్తారా .. అని ప్రశ్నించగా.. మాధురి గేమ్ ఆడడానికి మాత్రమే బిగ్ బాస్ కి వెళ్లారు.. ఎలాంటి బంధాలు పెట్టుకోవడానికి కాదు అని క్లారిటీ ఇచ్చారు.  అలాగే భరణిని దువ్వాడానే ఎలిమినేట్ చేయించారు అంటూ వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. ఇవన్నీ బుద్ధిలేని వాళ్ళు మాట్లాడుకునే మాటలు.. అతడికి ఓటింగ్ తక్కువగా రావడం వల్ల ఎలిమినేట్ అయ్యారు అంతే అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత భరణి గురించి ఇంకా మాట్లాడుతూ.. భరణి చాలా మంచి ప్లేయర్, ఎంతో సీనియారిటీ ఉన్న వ్యక్తి! మొదట్లో ఆయన టాప్ 5 పక్కా అని అందరు అనుకున్నారు. కానీ, మధ్యలో ఈ బంధాల మధ్య చిక్కుకుపోయి ఆటను పాడు చేసుకున్నారు అని తెలిపారు.  దువ్వాడ పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది వీడియోను చూడండి. 

Also Read: Disha Patani: ఉఫ్.. నెట్టింట సెగలు పుట్టిస్తున్న దిశా.. ఆ ఫోటోలేంటి! చూస్తే అంతే సంగతి

Advertisment
తాజా కథనాలు