Drinking Milk : ఆ సమయంలో పాలు తాగవద్దు.. ఎందుకో తెలుసుకోండి! పాలు తాగి అలా బెడ్ ఎక్కి నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంది. అయితే ఇది కరెక్ట్ కాదని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ చెబుతోంది. ఇలా నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరగడం, అజీర్ణం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే నిద్రకు కనీసం రెండు గంటల ముందు పాలు తాగాలి. By Trinath 11 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Drinking Milk Effects : పాలు(Milk) తాగాలి.. కానీ ఎప్పుడు తాగాలి.. ఎంత తాగాలి అన్నది ముఖ్యం.. ఇక అందరికి అన్ని సెట్ అవ్వాలని లేదు.. కొంతమంది బాడీకి లాక్టోస్ సెట్ అవ్వదు. లాక్టోస్(Lactose) అనేది మీరు పాలకు జోడించే చక్కెర. ఇది రుచికరంగా ఉంటుంది. ఏదేమైనా, నేషనల్ డైజెస్టివ్ డిసీజెస్ ఇన్ఫర్మేషన్ క్లియరింగ్ హౌస్(National Digestive Diseases information Clearing House) ప్రకారం, చాలా మంది లాక్టోస్ ఇన్టాలరెన్స్ కలిగి ఉంటారు. దీని వల్ల వారు పాలకు దూరంగా ఉంటారు. ఇక రాత్రి దీనిని తాగడం వల్ల గ్యాస్, ఉబ్బరం, నొప్పులు, తిమ్మిరి లాంటి సమస్యలు వస్తాయి. జీర్ణ సమస్యలను కూడా పెంచుతుంది. నైట్ నిద్రపోయే ముందు పాలు ఎందుకు తాగకూడదు? : గ్లూకోజ్ స్థాయిలు పెరగడం: లాక్టోస్ లేదా పాల అలెర్జీ ఉన్నవారికి, మీరు పాలకు చక్కెరను జోడిస్తే గ్లూకోజ్ తక్షణ రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. బరువు పెరగడం: చాలాసార్లు.. బరువు తగ్గడానికి(Weight Gain) ప్రయత్నిస్తున్న వ్యక్తులు అనవసరమైన కేలరీలను నివారించడానికి నిద్రపోయే ముందు పాలు తాగుతారు. అయితే పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగితే బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక గ్లాసు పాలలో సుమారు 120 కేలరీలు ఉంటాయి. నిద్రపోయే ముందు పాలు తాగితేమీ జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. ఎందుకంటే బెడ్ టైమ్‌కి ముందు తీసుకునే కేలరీలను బర్న్ చేయడం కొంచెం కష్టం. Also Read : Promise Day : ప్రేమకు ప్రతిజ్ఞ.. మీ ప్రేయసికి ప్రామిస్ డే విషెస్ చెప్పండి! అజీర్ణం: రాత్రి నిద్రపోయే(Night Sleep) ముందు పాలను ఎక్కువగా తాగడం వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయి. పాలు తాగిన తర్వాత మీరు చాలా త్వరగా పడుకుంటే. ఇది జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. మీ జీర్ణవ్యవస్థ రివర్స్‌లో ప్రయాణించడానికి కారణమవుతుంది. ఇది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్‌కి కారణమవుతుంది. ఛాతీ నొప్పి, గుండెల్లో మంట లాంటి లక్షణాలను మీరు గమనించవచ్చు. ఇది నైట్ స్లీప్‌ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. పాలు తాగడానికి ఉత్తమ సమయం: నేషనల్ స్లీప్ ఫౌండేషన్(National Sleep Foundation) ప్రకారం.. బెడ్ టైమ్‌కి ముందు పాలు తాగితే నిద్రకు కూడా ఆటంకం కలగవచ్చు. అయితే నిద్రకు రెండు నుంచి మూడు గంటలు ముందు పాలు తాగితే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయట. స్లీప్‌కి 2-3గంటల ముందు పాలు తాగితే అది బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పాలలో ట్రిప్టోఫాన్ ఉందని, ఇది మెలటోనిన్‌ను పెంచుతుందని... అందుకే డీప్ స్లీప్‌కి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. నిజానికి తినడం, తాగడం ఏది చేసినా వెంటనే బెడ్ ఎక్కి నిద్రపోవద్దు. ALSO READ: శృంగారానికి లూబ్రికెంట్లను ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి! #drinking-milk-at-night #health-tips #life-style #drinking-milk మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి