Diwali: అయోధ్యలో సరికొత్త రికార్డు.. ఒకేసారి 22.23 లక్షల దీపాల వెలుగులు..
దీపావళి పండుగ సందర్భంగా యూపీలోని అయోధ్య తమ రికార్డును తిరగరాసింది. 51 ఘాట్లలో ఏకంగా 22.23 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. సరయూ నది తీరంలో దీపావళికి ఒకరోజు ముందు 'దీపోత్సవ్' కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితిగా వస్తోంది.