Nandamuri Family : నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. వెండితెరకు పరిచయం చేయబోతున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్!
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని ఒకప్పటి డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అధికారికంగా ప్రకటించారు. దివంగత జానకిరామ్ పెద్ద కుమారుడు 'నందమూరి తారక రామారావునుఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నందుకు గర్వంగా ఉందని' వైవీఎస్ చౌదరి అన్నారు.